రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ ధర భారీగా పెంపు

సాధారణంగా పండుగల సమయంలో   రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ ధరను రైల్వే శాఖ పెంచుతుంది. తాజాగా కరోనా వైరస్‌(కోవిడ్‌-19)  వ్యాప్తి నివారణకు  రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.  రూ.10 ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ ధరను 50 రూపాయలకు  పెంచుతున్నట్లు ప్రకటించింది.   మొత్తం 250 రైల్వే స్టేషన్లలో టికెట్ల ధర పెంపు వర్తిస్తుందని పేర్కొంది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పెంచిన ధరలు అమల్లో ఉంటాయని రైల్వే శాఖ తెలిపింది.  కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్లాట్‌ఫామ్‌పై రద్దీని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే వెల్లడించింది.