పంజాబ్‌లో 105 కొత్త కేసులు

అమృత్‌స‌ర్‌: ‌పంజాబ్‌లో క‌రోనా పాజిటివ్‌ కేసులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. గురువారం కొత్త‌గా మ‌రో 105 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 480కు చేరింది. వారిలో 104 మంది వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 20 మంది మృతిచెందారు. మిగ‌తా 356 మంది యాక్టివ్ పేషెంట్లు వివిధ ఆస్ప‌త్రుల్లోని ఐసోలేష‌న్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు.